విజయనగరంలో న్యాయసేవపై అవగాహన


Ens Balu
7
Vizianagaram
2022-05-18 16:06:30

రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి న్యాయసేవా సంస్థ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు మే 25న కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ సూర్యకుమారి తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవా సంస్థ జిల్లా యంత్రాంగంతో కలసి నిర్వహిస్తున్న ఒక రోజు శిక్షణ కార్యక్రమం కోసం వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ బుధవారం జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి చర్చించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ దివ్యాంగుల శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, మెప్మ, సమగ్ర శిక్ష, డ్వామా ఆద్వర్యంలో స్టాల్ లు ఏర్పాటు చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొత్తవలసకు చెందిన స్వచ్చంద సంస్ధ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేపట్టాలని ఆర్.డి.ఓ. భవానీ శంకర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. డ్వామా ఆద్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, ఆర్.డి.ఓ. భవానీ శంకర్, డ్వామా పిడి ఉమా పరమేశ్వరి, పి.డి. మెప్మ సుధాకర్, డి.ఆర్.డి.ఏ. పి.డి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.