అనకాపల్లి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణానికి సంబంధించిన పనులు వేగం పుంజుకుంటున్నాయి. ప్రభుత్వభూముల్లో సువిశాల కలెక్టరేట్ నిర్మాణం చేయడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ కు శాశ్వత భవన నిర్మాణానికి అనువైన ప్రభుత్వ భూములు పరిశీలిస్తున్నట్లు జెసి కల్పనా కుమారి చెప్పారు. గురువారం ఆమె అనకాపల్లి మండలం లోని కోడూరు, కొండుపాలెం, అనకాపల్లి సౌత్ లలో ప్రభుత్వ భూములను పరిశీలించారు. ప్రభుత్వ అంచనా మేరకు నిర్మించబోయే కలెక్టరేట్ లోనే సుమారు 75 ప్రభుత్వశాఖలకు చెందిన జిల్లా కార్యాలయాలు కూడా ఉండనున్నాయి. ఈ మేరకు అంతపెద్ద స్థలాన్ని కూడా జిల్లా కలెక్టర్, జెసిల ఆధ్వర్యంలో గుర్తించి ప్రభుత్వానికి నివేదించనున్నారు. ప్రభుత్వ భూముల పరిశీలనలో జెసి వెంట రెవిన్యూ డివిజనల్ అధికారి చిన్నికృష్ణ, తాసిల్దార్ శ్రీనివాసరావు ఉన్నారు.