కొట్యాడ సెక్రటరీని సస్పెండ్ చేసిన కలెక్టర్
Ens Balu
10
Vizianagaram
2022-05-19 12:50:17
విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం కోట్యాడ పంచాయితీ సెక్రటరీ బంగారు తల్లిని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విధుల నుంచి గురువారం సస్పెండ్ చేసారు. స్పందన వినతులపై 30 రోజుల గడువు దాటినప్పటికి స్పందిక పోవడంతో సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. గడువులోగా స్పందన వినతులు పరిష్కరించవలసి వుండగా గడువు దాటి 2 రోజులు అయినప్పటికి స్పందించకపోవడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పంచాయతీల్లో ప్రజలకు పంచాయతీల నుంచి సేవలు అందకపోవడం పట్ల వస్తున్న ఫిర్యాలు, స్పందన పట్ల సిబ్బంది నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ చాలా గుర్రుగా ఉన్నారు. స్వయంగా హెచ్చరికలు జారీచేసినా తీరు మార్చుకోకపోవడంతో ఈ రోజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఈ అంశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.