టాలీవుడ్ యంగ్ టైగర్ సినీ నటుడు ,జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు అభిమానుల కోలాహలం నడుమ అత్యంత ఘనంగా నిర్వహించారు. విశాఖలో శుక్రవారం ప్రభుత్వ మహిళా కళాశాల సమీపంలో గ్రేటర్ విశాఖ ఎన్టీఆర్ సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పుట్టినరోజు వేడుకల్లో అప్పన్నదేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయజర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు
ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత అభిమానులతో కలిసి ఆయన కేక్ కట్ చేసారు. అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో వృద్ధులకు అనాథలకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజున ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సినీ హీరోలు అభిమానులు అంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని మరిన్ని సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన అభిమానులను శ్రీనుబాబు అభినందించారు. గ్రేటర్ విశాఖ ఎన్టీఆర్ సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏటా కూడా తాము జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.. సమాజ సేవలో తాము ముందు వరుస లో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ విశాఖ ఎన్టీఆర్ సేవా సమితి గౌరవ అధ్యక్షులు బ్రహ్మయ్య, చీఫ్ అడ్వైజర్ పొలమరశెట్టి శ్రీను, అధ్యక్షుడు బాలకృష్ణ, ఉపాధ్యక్షుడు సంతోష్, మహేష్, జాయింట్ సెక్రెటరీలు లక్ష్మణ్ చౌదరి, లోకేష్, అసిస్టెంట్ సెక్రటరీ తిరుమలరావు, కరస్పాండెన్స్ రవి, ప్రవీణ్, రవి, సురేంద్ర, సభ్యులు హరిప్రసాద్, నాని, హరిన్, దిలీప్, రెడ్డి, దివాకర్, హరి, ఆరిలోవ బుజ్జి, వెంకటేష్, ఉప్పలపాటి సత్య రాజ్ కుమార్ టీడీపీ సీనియర్ నాయకుడు యల్లపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.