జిల్లామైక్రో ఇరిగేషన్ అధికారిగా మన్మథరావు
Ens Balu
5
Parvathipuram
2022-05-24 08:25:29
పార్వతీపురం మన్యం జిల్లా సూక్ష్మ నీటిపారుదల అధికారిగా కె.మన్మథ రావు నియమితు లయ్యారు. ఈ మేరకు ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మన్మథ రావు ఇప్పటి వరకు సూక్ష్మ నీటిపారుదల ఇన్ ఛార్జ్ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయి జిల్లా సూక్ష్మ నీటిపారుదల అధికారిగా నియమిస్తూ పార్వతీపురం మన్యం జిల్లాకు నియమితులయ్యారు. సూక్ష్మ నీటిపారుదల ద్వారా రైతులు అధిక సాగుచేసి దిగుబడులు సాధించుటకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం కార్యాలయ సిబ్బందిని పరిచియం చేసుకున్నారు.