బాధితులకు పరిహారంపై అవగాహన
Ens Balu
3
Visakhapatnam
2022-05-24 14:25:54
విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో "బాధితులకు పరిహారం" అనే అంశం పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని బార్ అసోసియోషన్ లైబ్రేరి హాల్ లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా జిల్లా జడ్జ్ మరియు జిల్లా లీగల్ సర్వీసెస్ అదారిటీ చైర్మన్ గౌ.ఎ.హరిహరనాధ శర్మ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రిమినల్ కేసుల్లో బాధితులకు పరిహారం అందేలా రూపొందించిన పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, న్యాయవాధులు భాదితులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ అవగాహన కార్యక్ర్రమంలో రెండోవ అదనపు జిల్లా జడ్జి ఎస్.శ్రీదేవి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ. వి.రవీంద్ర ప్రసాద్, బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఎస్.కృష్ణమోహన్, బార్ అసోసియేషన్ కార్యదర్శి .వేణుగోపాల్, జిల్లా న్యాయ సేవాదికర సంస్ధ కార్యదర్శి కె. కె. వి. బుల్లి కృష్ణ, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శైలజ, ప్యానల్ అడ్వకేట్ ఆర్.శ్రీనివాస రావు, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.