14న అప్పన్నకు 3వ విడత చందన సమర్పణ


Ens Balu
11
Simhachalam
2022-05-25 08:38:40

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి వచ్చేనెల 14న మూడో విడతగా 3 మణుగుల చందనాన్ని శాస్త్రోక్తంగా సమర్పించనున్నట్లు అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు  తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉదయం సింహాద్రి నాధుడునీ దర్శించుకున్న శ్రీను బాబు స్థానిక పాత్రికేయులతో మాట్లాడారు. అప్పన్నకు చందనం సమర్పించేందకు చేపట్టే అంశాలను వివరించారు. జేస్ట  పౌర్ణమిని పురస్కరించుకొని ఆ రోజు 3 మణుగుల చందనాన్ని స్వామికి సమర్పిస్తారన్నారు. ఇప్పటికే చందనోత్సవం రోజు రాత్రికి మూడు మణుగుల చందనాన్ని తొలివిడతగా స్వామికి సమర్పించగా, ఆ తర్వాత వచ్చే వైశాఖ పౌర్ణమికి మరో మూడు మనుగులు చందనము (ఇప్పటి వరకుమొత్తం 250 కేజీలు) స్వామికి సమర్పించినట్లు తెలిపారు. ఆ తర్వాత వచ్చే  ఆషాడ పౌర్ణమికి మిగిలిన మూడు మణుగుల చందనాన్ని సమర్పిస్తారన్నారు. ఏడాదిలో నాలుగు విడతలుగా 12 మణుగుల చందనాన్ని స్వామికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని వివరించారు. ఆ తర్వాత వచ్చే శ్రావణ పౌర్ణమినీ  పురస్కరించుకుని కరాళ చందన సమర్పణ ఉంటుందన్నారు,, మూడో విడత కు అవసరమైన చందనాన్ని త్వరలోనే సిబ్బంది అరగదీస్తారని  చెప్పుకొచ్చారు. సింహగిరి పై జరుగుతున్న ఆర్జిత సేవలకు భక్తులు నుంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. ప్రస్తుతం స్వామివారికి ఎనిమిది రకాల సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. నిత్యకల్యాణం, గరుడసేవ, లక్ష్మీనారాయణ వ్రతం, స్వర్ణపుష్పార్చన, స్వర్ణ తులసీదలార్చనతో పాటు అన్నప్రాసన ,అక్షరాభ్యాసం సేవలు అందుబాటులో ఉన్నట్లు శ్రీను బాబు వివరించారు. వీటిని భక్తులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని స్వామివారి సేవలో తరలించాలని మీడియా ద్వారా భక్తులను కోరారు.