నిలకడగానే మంత్రి ఆరోగ్యం.. ఫోనులో అందుబాటు
Ens Balu
3
Visakhapatnam
2020-09-19 11:21:07
రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆరోగ్యం నిలకడగానే వుంది. ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్స పొందుతున్న మంత్రి ఆరోగ్యం బాగానే వున్నట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. మంత్రి ముఖ్యమైన కార్యక్రమాలకు సంబంధించి అధికారులు, నాయకులకు ఫోన్ లే అందు బాటులో ఉంటున్నారు. ఎవరినీ ఇంటికి రావొద్దని, తన ఆరోగ్యం బాగానే వుందని నాయకులకు సూచిస్తున్నారు. విశాఖలో కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతున్న తరుణంలో కొందరు నాయకులు మంత్రి ఆరోగ్యంపై ఆరాతీస్తున్న సమయంలో తాను మందులు వాడుతూ, ఇంటిలోనే ఉన్నాని ముఖ్య కార్యకర్తల ద్వారా సమాచా రం పంపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, అదే సమయంలో ప్రభుత్వ నిభందనల మేరకు సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు తప్పనిసరిగా వాడా లని ఏ నాయకుడు ఫోన్ చేసినా వారికి సూచించడం విశేషం. కరోనా వైరస్ వచ్చినంత మాత్రాన భయపడాల్సిన పనిలేదని, అలాగని అశ్రద్ధ కూడా చేయకూ డదని మంత్రి ప్రజలకు వివరిస్తున్నారు.