పొగాకు వినియోగాన్ని పూర్తిగా నియంత్రించాలి
Ens Balu
15
Srikakulam
2022-05-31 07:37:46
పొగాకు వినియోగం ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 10 లక్షల మంది మరణిస్తు న్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయని, కావున ప్రతీ ఒక్కరూ పొగాకుకు దూరంగా ఉండా లని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.మీనాక్షి జిల్లా ప్రజలకు సూచించారు. మే 31న ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ర్యాలీ కార్యక్ర మాన్ని డా.బి.ఆర్.అంబేద్కర్ కళావేదిక వద్ద మంగళవారం నిర్వహించింది. ఈ కార్యక్ర మానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ర్యాలీకి పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభిం చారు. పొగకుతో పర్యావరణానికి ముప్పు అనే నినాదంతో అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీలో పాల్గొని మొక్కలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొగాకుతో వచ్చే ప్రమాదాలు గురించి తెలిసినప్పటికీ యువత ధూమపానానికి అలవాటు పడుతున్నారని, ఇది ప్రాణాంతకమని ప్రతీ ఒక్కరూ గుర్తించాలని కోరారు. పొగాకు తీసుకోవడం వలన ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి రోగాల బారిన పడే అవకాశముందని ఆమె గుర్తుచేసారు. పొగాకు వినియోగం వలన వచ్చే సమస్యలను ప్రజలకు వివరించడమే కాకుండా, వాటికి దూరం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పొగాకు రహిత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. కావున యువత పొగాకు వినియోగానికి దూరంగా ఉంటూ తమతో పాటు తమ తోటి వారి ఆరోగ్య పరిరక్షణకు తోడ్పాటును అందించాలని ఆమె అభిలషించారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎన్.అనురాధ, మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, రవిప్రసాద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.