జెడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా


Ens Balu
4
Vizianagaram
2022-05-31 11:01:15

విజయనగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జూన్ 1వ తేదీన జరగాల్సిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జూన్ 2వ తేదీకి వాయిదా పడినట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అశోక్ కుమార్ తెలిపారు. జూన్ 2వ తేదీ ఉదయం 10-30 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సభ్యులు, అధికారులు మార్పును గమనించి, మార్పు చేసిన తేదీరోజు అన్ని రకాల రికార్డులతో తప్పనిసరిగా  హాజరు కావాలని కోరారు.