దావోస్ పెట్టుబడులు రూ.1.25 లక్షల కోట్లు
Ens Balu
5
Visakhapatnam
2022-05-31 12:58:46
దావోస్ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ కి లక్షా ఇరవై అయిదు వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం వుందని రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ అతిధి గృహాంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ, మే 22 నుంచి 26 వరకు దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కు ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ప్రతినిధుల బృందం వెళ్ళామని, ఆంధ్రప్రదేశ్ లో అవకాశం వున్న అంశాలనే దావోస్ లో ప్రోజెక్ట్ చేశామన్నారు. వైద్య రంగంలో ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంస్కరణలు ఫ్యామిలీ డాక్టర్ విధానం అందర్నీ ఆకట్టుకుందని తెలిపారు. వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అవకాశాలు వివరించడం జరిగిందన్నారు. మన రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, తీర ప్రాంత ప్రయోజనాలు ప్రపంచ స్థాయి వేదిక పై వివరించామన్నారు. 50 ప్రపంచ స్థాయి కంపెనీల ప్రతినిదులు, కొత్త పారిశ్రామిక వేత్తలు ముఖ్య మంత్రి తో బేటీ అయ్యారని తెలిపారు. విశాఖ ఐటి unicorn చేయాలన్న ప్రయత్నం దావోస్ సదస్సు లో జరిగిందని, గ్రీన్ ఎనర్జీ ప్రోజెక్ట్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ ద్వారం కాబోతుందని తెలిపారు. విశాఖలో వెయ్యి కోట్ల పెట్టుబడులతో ఆదిత్య మిట్టల్ కంపెనీ విస్తరించనుందన్నారు. పంపు స్టోరేజ్.. విండ్.. సోలార్ ద్వారా 30 వేల కోట్ల మెగా వాట్ల గ్రీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్ లో ఉత్పత్తి జరగనుందని, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ విశాఖలో కార్యాలయం పెట్టడానికి ముందుకు వచ్చిందన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశాఖలో ఉపాధి అవకాశాలు రానున్నాయని, దావోస్ సదస్సు ద్వారా ప్రపంచ స్థాయి పారిశ్రామిక వేత్తలను ఆంధ్రప్రదేశ్ కి ఆహ్వానించడం జరిగిందన్నారు.