2.56లక్షల రైతుల ఖాతాల్లో రూ.51.15 కోట్లు


Ens Balu
4
Srikakulam
2022-05-31 13:02:46

దేశంలో అర్హలైన రైతుల ఖాతాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పథకం నగదు జమ చేసినట్లు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వెల్లడించారు.  డా.బి.ఆర్.అంబేద్కర్ కళా వేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా (13 కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు) గరీభ్  కళ్యాణ్ సమ్మేళన్ పై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కొన్ని జిల్లాల లబ్దిదారులతో దృశ్య మాద్యమం (వీడియో కాన్ఫరెన్స్) ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలు గూర్చి లబ్ధిదారులతో ముఖా ముఖిగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలలైన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన,  ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన, పోషణ్ అభియాన్, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన, స్వచ్చ భారత్ మిషన్, జల జీవన్ మిషన్, అమృత్, ప్రధాన మంత్రి స్వనిధి, ఒకే దేశం ఒక రేషన్ కార్డు, ప్రధాన మంత్రి గరిబ్ కళ్యాణ్ అన్న యోజన, ఆయుష్మాన్ భారత్ పి.యం.జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ హెల్త్, వెల్నెస్ కేంద్రాలు,  ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకాలపై ఆయన మాట్లాడారు. దేశంలో అర్హులైన  కోట్ల మంది రైతుల ఖాతాలో ప్రధాన మంత్రి కిషాన్ సమ్మాన్ నగదు జమ చేసినట్లు పేర్కొంటూ, ఇటువంటి అవకాశం నాకు రావడం చాలా అదృష్టమన్నారు. కరోనా కష్టకాలంలో తల్లి దండ్రులు ఇద్దరినీ కోల్పోయిన పిల్లలకు సోమవారం (30వ తేదీన)  సహాయం అందజేయడం జరిగిందని, అందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.  భారతదేశంలో ఉన్న ప్రజలకు సేవచేసుకునే అదృష్టాన్ని నాకు అందించినట్లు వివరించారు. ఈ పథకాలు మోడీ అందించారు అనుకోకండి దేశ ప్రజలు ఎన్నుకోవడంతో నాకు ఇటువంటి అవకాశం కలిగిందన్నారు. ప్రతి ఒక్కరూ నిర్దేశించిన సంకల్పం ప్రతిసారీ గుర్తు చేసుకోవాలని హితవు పలికారు.  

అటువంటి సంకల్పం తో ముందుకు పోవడం, ఆ లక్ష్యాలతో ముందుకు సాగుదామన్నారు.  2014 సంవత్సరానికి ముందు పత్రికల్లో వచ్చే వార్తలకు నేడు వస్తున్న వార్తలకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. నేడు పత్రికల్లో కేంద్ర ప్రభుత్వ అందిస్తున్న పథకాల, అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వార్తలు కనిపిస్తున్నాయని అన్నారు. సేవా భావం, పేదరికం నిర్మూలనకు ముందుకు సాగుతోందన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ పథకాలు అవే ఉంటాయని తెలిపారు.  శాశ్వత  సమస్యలు అనుకున్నవి పునరావృతం కాకుండా సమస్యలను పరిష్కరించినట్లు పేర్కొన్నారు.  అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ. 2 లక్షల భీమా అందజేయడం జరిగిందన్నారు. 200 కోట్ల వ్యాక్షినేషన్ వేయించడం జరిగిందని చెప్పారు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేందుకు జల జీవన్ మిషన్ పథకం అందజేయడం జరిగిందన్నారు. అలాగే ముద్ర పథక్ ద్వారా పలువురు ఉపాధి కల్పించినట్లు చెప్పారు. ప్రతి ఒక్క పేదవానికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతుందన్నారు. భారత్ చేయూత ఇవ్వడాకి ఎప్పుడూ ముందు వుంటుందని స్పష్టం చేశారు. భారత్ లో ప్రస్తుతం. పేదరిక శాతం తగ్గుతుందని, దేశంలో అన్ని రకాల ఉత్పత్తులు జరగి మార్కెట్లోకి వస్తే భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. భారత్ ఆర్థికంగా అభివృధి చెందే దేశాలల్లో ముందున్నది వెల్లడించారు. ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వైద్య, సాంకేతిక చదువులు, మాతృ భాషలు జరిగేలా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.

జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయని, గృహనిర్మాణ పథకం, పిఎం కిసాన్ పథకం, వై.యస్.ఆర్.రైతు భరోసా, జగనన్న తోడు, జగనన్న శాశ్వత భూ హక్కు, స్వచ్ఛదార, జగనన్న స్వచ్చ సంకల్పం, తదితర పథకాలను గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా వివిధ పథకాలలు లబ్ధిదారునికి అందించడం జరుగుతుందని వివరించారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ కింద  జిల్లా లో 2.56 లక్షల మంది రైతులకు సుమారు 51.15 కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో ప్రధాన మంత్రి జమ చేసినట్లు వివరించారు. గార మండలం శాలిహుండం గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు కృష్ణ వేణి మాట్లాడుతూ  3 సంవత్సరాలు నుండి పిఎం కిసాన్ పథకం వస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు వలన రైతులందరమూ లబ్ధి పొందుతున్నట్లు ఆమె తెలిపారు. దమ్ములు పట్టే సమయంలో నగదు వస్తుందని, వాటిని వ్యవసాయంలో పెట్టుబడిక్రింద ఉపయోగ పడుతుందని ఆమె వివరిస్తూ ప్రధాన మంత్రికి రైతులు తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీకాకుళం మునిసిపాలిటీ పరిధిలో ఉన్న వడ్డాది సోమేశ్వరరావు మాట్లాడుతూ ఏటువంటి  సెక్యూరిటీ డిపాజిట్లు లేకుండా తనకు ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం క్రింద తనకు శేషాద్రి ఆర్ట్స్ అండ్ సినీ రంగం స్లైడ్స్ మేనేజింగ్ పార్టనర్ గా యాడ్ ఏజెన్సీ పెట్టుకోడానికి కంప్యూటర్లు, ఇతర సామగ్రి కొనుగోలు నిమిత్తం  లోన్ మంజూరు చేశారని, తద్వారా కేంద్ర ప్రభుత్వ ఈ రోజు సమాజంలో తనకు ఒక స్థానం కల్పించిందని తాను ఉపాధి పొందుతూ మరో ఇద్దరికీ ఉపాధి కల్పించగలిగానని సంతోషం వ్యక్తం చేశారు.  శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఎలేశ్వరి మాట్లాడుతూ  నేను గర్భవతిగా ఉన్న సమయంలో పోషక విలువలు కలిగే ఆహారాన్ని తీసుకోవడానికి కరోనా సమయంలో నాకు ఆర్థికంగా సహాయ అందించారని సంతోషం వ్యక్తం చేశారు.  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మీనాక్షి మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పి.యం.జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ హెల్త్, వెల్నెస్ కేంద్రాలు గూర్చి వివరిస్తూ  పథకంలోని లబ్దిదారులు, పురోగతి గూర్చి  చెప్పారు. 

          ముందుగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎల్.ఇ.డి. స్క్రీన్ లో ప్రధాన మంత్రి లబ్దిదారులతో ముఖా ముఖిగా మాట్లాడటం, ప్రధాన మంత్రి సందేశాలను అధికారులు, లబ్దిదారులు, తదితరులు వీక్షించారు. లబ్దిదారులు తాము లబ్ది పొంది అభివృద్థి చెందిన విధానంను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుండి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీపతి, వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మీనాక్షి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకట రమణ, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ ఇ ప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్ హరి ప్రసాద్, డిఆర్డిఎ పిడి శాంతి శ్రీ, ఐసీడీఎస్ పీడీ అనంతలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ఆర్హులైన లబ్ధిదారులకు నమూనా చెక్కును అందజేశారు.