నిన్న పంచకర్ల..నేడు వాసుపల్లి...రేపు..?


Ens Balu
7
Visakhapatnam
2020-09-19 13:34:42

విశాఖజిల్లా వైఎస్సార్సీపీ లో వినూత్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి...మొన్నటి వరకూ పార్టీని ఎండగట్టిన వారంతా ఒక్కసారిగా పార్టీలోకి అమాంతం క్యూ కట్టేస్తున్నారు. ముందుగా పార్టీలో రావాలనుకున్న గంటా శ్రీనివాసరావుకి బెర్తు ఖరారు కానప్పటికీ ఎమ్మెల్యేలకి మాత్రం లైన్ క్లియర్ అవుతుంది. మాజీలు నేరుగా పార్టీలో చేరిపోయారు. నిన్న పంచకర్ల రమేష్ అధికారాపార్టీ తీర్థం పుచ్చుకుంటే..నేడు వైజాగ్ డిఫెన్స్ అకాడమీ విద్యా సంస్థల చైర్మన్, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో విశాఖ మహా నగరంలో నాలుగు నియోజకవర్గాల్లో ఒక్క స్థానం కూడా అధికారపార్టీ గెలవలేకపోయింది. కానీ 2020లో మాత్రం గెలిచిన ఎమ్మెల్యే ఖాతా ఒకటి అధికారపార్టీలోకి చేరిపోయింది. మరికొద్ది రోజుల్లో విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే, వెలగపూడి, పశ్చిమ నియోజవర్గ ఎమ్మెల్యే గణబాబు తదితరులు పార్టీ తీర్ధం పుచ్చుకోవడినికి సిద్ధ పడుతున్నారనే వార్తలు గుప్పు మంటు న్నాయి. టిడిపి రాజున్న రోజుల్లో తన బలాన్ని నిరూపించుకునే అవకాశాలు లేనందునే అధికారపార్టీలోకి వలసలు పెరుగుతున్నాయనే వాదన కూడా వినిపిస్తుంది. కొత్తవారి రాకతో..పదేళ్లుగా పార్టీకి సేవలు చేసిన వారి పరిస్థితి ఏమవుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ అందరికీ న్యాయం జరగడంతో అవకాశం వున్నవారంతా అధికారపార్టీ తీర్ధం పుచ్చుకోవడం చర్చనీయాంశం అవుతుంది...!