ఎంపీ సురేష్ ప్రభు సహాయం మరువలేనిది


Ens Balu
6
Visakhapatnam
2022-06-02 03:28:09

అల్లూరి సీతారామరాజు నడయాడి, వీర మరణం పొందిన ప్రాంతాల అభివ్రుద్ధికి రూ.కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్టు మాజీ కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి, రాజ్యసభ సభ్యులు సురేష్ ప్రభు ప్రకటించడం హర్షణీయమని అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం విశాఖలో జిల్లా మీడియాతో మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు సంచరించిన ప్రదేశాలను సెంట్రల్ టూరిజం ప్రాజెక్టుగా తీర్చి దిద్దాలని తాము ప్రధానమంత్రి కార్యాలయాలనికి, కేంద్రం పర్యాటకశాఖ కార్యాలయానికి లేఖలు రాశామన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ(రాజ్యసభ్) సురేష్ ప్రభు ముందుకి వచ్చి అల్లూరి సంచరించిన మంప ప్రాంతానికి కోటి రూపాయలు కేటాయిస్తున్నట్టు ప్రకటించడం అభినందనీయమన్నారు.. ఇదే రీతిలో అల్లూరి విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అల్లూరి చరిత్రను కేజీ నుంచి పీజీ వరకూ పాఠ్యాంశాలుగా చేర్చి ఆయన బ్రిటీషు సేనలపై చేసిన వీరోచిన తిరుగుబాటుపైనా, సాయుధ సమరమపైనా, ప్రపంచమే తొంగిచూసిన పోరాటాలపై పరిశోధనలు చేసే స్థాయికి తీసుకు రావాలని కోరారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వమే అల్లూరి సీతారామరాజుకి సంబంధించిన నాటి మద్రాసు ప్రావిన్సు బ్రిటీషు ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్లను, బయటకు తీసి ప్రజలకు తెలియజేయాలని కోరారు.  అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) మీడియాకి వివరించారు.