స్వచ్ఛత లక్ష్యంతో..ప్రధానమంత్రి అవార్డు రేసులో..
Ens Balu
3
మహావిశాఖ నగరపాలక సంస్థ
2020-09-19 14:02:35
విశాఖను స్వచ్ఛ సర్వేక్షణ్ లో మొదటి స్థానంలో నెలబెట్టాలి...కాలుష్య విశాఖను స్వచ్ఛ విశాఖ చేయాలి...దేశం మొత్తం విశాఖ వైపే తొంగిచూడాలి...సాలిడ్ వేస్ట్ మే నేజ్ మెంట్ లో అగ్రభాగంలో నిలవాలి...అలాచేయాలంటే ఒక దమ్మున్న అధికారి కావాలి..ఆమే ప్రభుత్వం ఏరికోరి జీవిఎంసీకి నియమించిన ఆ ఐఏఎస్ అధికా రిణి డా.స్రిజన. ఈ అధికారిణి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, సత్వర చర్యలతో దేశంలోని స్వచ్ఛ నగరాల్లో టాప్ 10లో నిలిచింది జివిఎంసి. ఇపుడు ఈ అధికారి ముందున్న లక్ష్యం టాప్ వన్ లో నిలబెట్టాలనే. దానికోసం ఈ అధికారిణి చేస్తున్న శ్రమ, తీసుకుంటున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. పైగా స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రధానమంత్రి అవార్డు–2020కి ఎంపికైన 10 జిల్లాల జాబితాలో విశాఖ చోటు దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ మిషన్(ఎస్‌బీఎం)లో ప్రజల భాగస్వామ్యం కేటగిరీలో ప్రధాన మంత్రి అవార్డు కోసం విశాఖపట్నం దేశంలోని తొలి పది యూఎల్‌బీ క్లస్టర్ల జాబితాలో నిలిచింది. ఈసారి కేవలం విశాఖ నగరం మాత్రమే కాకుండా.. జిల్లాలోని యూఎల్‌బీలన్నీ కలిపి క్లస్టర్‌గా ఏర్పడి ఈ అవార్డు కోసం పోటీ పడుతోంది. ప్రస్తుతం అధికారులు, సిబ్బంది కొరత కాస్త వెనుకబడి వున్న జివిఎంసికి ప్రభుత్వం అధికారులను కేటాయిస్తే ఆ లక్ష్యం నెరవేరుతుం దడనంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..