ఉత్సవమూర్తులకు కవచాల తొలగింపు
Ens Balu
7
Tirumala
2022-06-07 12:48:06
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారి ఉత్సవమూర్తులకు కవచం తొలగింపు కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. రెండో గంట తరువాత రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సంవత్సరం పొడవునా అభిషేకాది క్రతువుల కారణంగా ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు కవచాలను తొలగించి శుద్ధి చేస్తారు. సాధారణంగా జ్యేష్ఠాభిషేకానికి ముందు మంగళవారం కవచాలను తొలగించి అవసరమైన మరమ్మతులు పూర్తి చేస్తారు.ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్టాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే ఉంటారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్‌బాబు, పేష్కార్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.