27న ఉత్తరాంధ్ర బహుజన చైతన్య సభ


Ens Balu
4
Visakhapatnam
2022-06-18 13:41:56

ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి సందర్భంగా ఉత్తరాంధ్ర బహుజన చైతన్య సభ "ఛలో వైజాగ్" ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్నట్లు పాడేరు మాజీ ఎమ్మెల్యే, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లకే రాజారావు తెలిపారు. రామటాకీస్ అంబేద్కర్ భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమాన్ని సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ  27న సోమవారం ఆర్కే బీచ్ లో మధ్యాహ్నం 3 గంటలకు బహుజన చైతన్య సభ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. .ఉత్తరాంధ్ర నేడు ఆంధ్రప్రదేశ్ బహుజన రాజ్యస్థాపన లో ముందు భాగంలో నిలవాలని ఆకాంక్షించారు. అదే మనం సాహు మహారాజ్ కి ఇచ్చే ఘన నివాళి అని అన్నారు. ఉత్తరాంధ్ర బహుజనులకు తమ ప్రాంతంపై నిర్ణయాత్మకమైన అధికారం ఉండాలన్నారు. వెనుకబాటుతనాన్ని పోగొట్టడానికి సరైన పరిష్కారాలు కావాలంటే అధికారం ఉత్తరాంధ్ర బహుజన చేతుల్లోకి రావాలని కోరారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చేందుకు దళితులంతా ఏకం కావాలన్నారు. విశాఖలో పెద్ద ఎత్తున జరగనున్న బహుజన చైతన్య సభను జయప్రదం చేయాలని లకే రాజారావు కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  కరణం తిరుపతిరావు, జిల్లా అధ్యక్షులు బోను కృష్ణ, సోము రాంబాబు, పీరుబండి ప్రకాష్ రావు, తదితరులు పాల్గొన్నారు.