విశాఖలో చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ప్రతినిధులు రాష్ట్ర పరిశ్రమలు,ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాధ్‌ను కోరారు. శనివారం మిందిలోని స్ధానిక మంత్రి నివాసంలో పద్మశాలి సంఘం నాయకులు,ప్రతినిధులు మంత్రిని కలిసి వినతిపత్రాన్ని అందించారు. కేంద్ర బడ్జెట్‌లో చేనేతలకు రూ.200కోట్లు మాత్రమే కేటాయిస్తోందని, దీంతో చేనేతలకు ప్రయోజనం చేకూరడంలేదని చెప్పారు. నేతన్న నేస్తం కింద చేనేతలకు 24వేల రూపాయాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, ఇది కొద్ది మందికే అందుతుందని మంత్రి అమర్‌కు తెలియజేశారు. చేనేత కులాల వారికి ఓల్డేజ్ హోం,ఫంక్షన్ హోల్,విద్య,వైద్య సదుపాయాలు కల్పించాలని ఆ వినతిపత్రంలో కోరారు.ఈ వినతి పత్రం అందించిన వారిలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశాఖ జిల్లా అధ్యక్షుడు పప్పు రాజరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల రామ్ కుమార్, పెద్దల కమిటీ చైర్మన్ తెడ్లుపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.