ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రతినిధుల సమావేశం ఈనెల 26న విశాఖపట్నం మాధవధార లోని శ్రీ కనకదుర్గ ఫంక్షన్ హాల్ లో జరగనుందని జిల్లా కమిటీ ప్రతినిధులు నేమాల.హేమసుందరరావు, హనుమంతు లక్ష్మణ్, సీపాన ప్రసాద్, గొండు అచ్యుతరావులు తెలియజేశారు. ఈ సమావేశానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివనాయుడుతో పాటు రాష్ట్ర కమిటీ ఇతర ప్రతినిధులు, వివిధ జిల్లాల యూనియన్ ప్రతినిధులు హాజరు కానున్నారని.. వివరించారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే సమావేశ ప్రాంగణాన్ని, ఏర్పాట్లను యూనియన్ జిల్లా ప్రతినిధులతో కలిసి యూనియన్ రాష్ట్ర కమిటీ సలహాదారు కాకుమాను వెంకట వేణులు పరిశీలించారు. ఉత్తరాంధ్రాజిల్లాల ప్రతినిధుల సమావేశంలో అనేక ముఖ్యమైన అంశాలను చర్చించడంతోపాటు కార్యాచరణను కూడా ప్రకటిస్తామని ఈ సందర్బంగా వారంతా మీడియాకి వివరించారు.