రేపు విశాఖలో పర్యావరణ పాటయాత్ర
Ens Balu
3
విశాఖపట్నం
2022-06-24 07:40:56
విశాఖలో పర్యావరణ పాటయాత్ర కార్యక్రమం చేపడుతున్నట్టు పర్యావరణ కళామండలి రాష్ట్ర కమిటీ సభ్యుడు, ప్రజాగాయకుడు దేవిశ్రీ తెలియజేశారు. ఈ మేరకు శక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ప్రతీ శనివారం పుడమి పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ పాటయాత్ర చేపడుతున్నట్టు చెప్పారు. విశాఖను కాలుష్యం కోరల నుంచి రక్షించుకోవడానికి పాటలతో ప్రజలను చైతన్యం చేయడానికి విశాఖలోని బీచ్ రోడ్డులోని పామ్ బీచ్ లోని అల్లూరి విగ్రహం నుంచి శ్రీశ్రీ విగ్రహం వరకూ ఈ పాటయాత్ర కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యావరణ ప్రేమికులు, కవులు, కళాకారులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మీడియా ద్వారా దేవిశ్రీ కోరారు.