పర్యావరణ పాటయాత్రలో దేవిశ్రీ గొంతు


Ens Balu
3
Visakhapatnam
2022-06-25 10:13:21

ప్రకృతి వనరులని  రక్షించుకోలేకపోతే  మానవాళికి మరణసశానమే అని పర్యావరణ కళా మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రజా గాయకుడు మజ్జిదేవిశ్రీ అన్నారు. శనివారం ఉదయం బీచ్ రోడ్ లో ఉన్న అల్లూరి సీతారాం రాజు విగ్రహం నుంచి పాటయాత్ర పాదయాత్రగా ప్రారంభమై శ్రీశ్రీ విగ్రహం వరకూ సాగింది. ఈ సందర్భంగా దేవిశ్రీ మాట్లాడుతూ, ప్రకృతి ప్రకోపిస్తే పరిస్థితులు తలకిందులు అవుతాయని తనదైన శైలిలో గొంతు పెకిలించి పాడిన చైతన్య గీతాలు ఆలోచింపచేసాయి. ఏమిచ్చావని ప్రకృతి వానయ్యింది.. ఏమిచ్చావని ప్రకృతి నీకు గొడుగుయింది.. ఏమిచ్చావని ప్రకృతి నీడయ్యింది.. అంటూ ఆలపించారు. ప్రభుత్వం నిషేధించిన 16 రకాల ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దు అంటూ ప్రతీ ఒక్కరినీ అభ్యర్ధించారు. పర్యావరణ సమతుల్యాణికి ముప్పుతెచ్చిపెట్టే మానవతప్పిదాలు వల్లే అడవిలో జీవించవలిసిన పులి,సింహం,కొండచిలువ,వంటి వన్యప్రాణులు జనవాసాల్లోకి చొరబడి వస్తున్నాయన్నారు. ప్రతీ ఒక్కరూ పచ్చదనాన్ని పెంచేందుకుందు ముందుకు రావాలని కోరారు.  పర్యావరణ పరిరక్షణ నినాదాలు,ఆలోచన రేకెత్తించే అర్ధవంతమైన గీతాలుతో కార్యక్రమం ఆద్యంతం సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు, కార్పొరేటర్ సాధిక్ మహమ్మద్ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు బాల మోహన్ దాస్ ,మంజుల, బాబీ వర్ధన్,కళా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రమణ మూర్తి పర్యావరణ కళా మండలి సభ్యులు పెద్దింటి శ్రీనివాస్ శ్రీకాంత్, సీత రోజా లక్ష్మి బొబ్బది అప్పారావు, న్యాయవాదులు  శ్రీరామ్ మూర్తి, వేణు ఆంద్రా విశ్వవిద్యాలయం పరిశోధకులు పాల్గొన్నారు.