నిశ్వార్ధ సేవకు నిలువెత్తు సత్కారం..


Ens Balu
2
Visakhapatnam
2022-06-26 03:51:30

కోవిడ్-19 పాండమిక్ సమయంలో ఆమె చేసిన అలుపెరగని సేవ మాటల్లో చెప్పలేం.. అర్ధరాత్రీ, అపరాత్రీ అనే తేడా లేకుండా  ప్రాణాలమీదకు వచ్చినవారిని ఎలాగైనా కోవిడ్ నుంచి కాపాడాలనే ఆమె తపన, చేసిన విధి నిర్వహణ అంతా ఇంతా కాదు. విపత్కర సమయంలో ప్రభుత్వ అధికారిగా మనవంతు సహకారం అందిస్తే కొంత మేరకైనా కోవిడ్ నుంచి ప్రజలను కాపాడవచ్చుననేది ఆమె బావన. దానికి తగ్గట్టుగానే 24 గంటల పాటు కోవిడ్ ప్రత్యేక కేంద్రం అధికారిగా విశాఖ అర్భన్ తహశీల్దార్ జ్నానవేణ అందించిన సేవలను వైజాగ్ పటం చాంబర్ ఆఫ్ కామర్స్ గుర్తించి..ఘనంగా సత్కరించింది. అంతేకాకుండా విసిసిఐ ఎక్స్ లెన్స్ అవార్డ్-2022తో సన్మానించింది. ప్రభుత్వ అధికారులు మనసు పెట్టి పనిచేస్తే ఎందరో నిరుపేదలకు ప్రభుత్వ సేవలు నేరుగా అందడంతోపాటు, నాణ్యమైన వైద్యం కూడా అందుతందని నిర్వాహకులు కొనియాడారు. కోవిడ్ లాంటి పాండమిక్ లో జ్నానవేణిలాంటి అధికారుల సేవలు మరెందరికో ఆదర్శమంటూ కొనియాడారు. విశాఖలో జరిగిన అదే కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ఎదురుగా భారీ విపత్తు..ఎందరో ప్రాణాలు పోగొట్లుకుంటున్నారు..ఆ సమయంలో ప్రభుత్వం ద్వారా అందించే వైద్య సహాయానికి నన్ను అధికారిగా జిల్లా కలెక్టర్ ఎంపిక చేసిన దగ్గర నుంచి ప్రతీరోజూ ఎంతమందిని కాపాడతాననే లక్ష్యంతోనే పనిచేశాను. ఆ సమయంలో తాను అస్వస్థతకు లోనైనా కోవిడ్ బారిన పడిన వారి ప్రాణాలు కాపాడాలనే ఒకే ఒక్క సంకల్పంతో పనిచేయడం ఎంతో సంత్రుప్తినిచ్చిందని అన్నారు.. కోవిడ్ మహమ్మరాభారిన పడకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఆరోగ్య సూత్రాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చైతన్యం కల్పించినట్టు పేర్కొన్నారు. తమ తల్లిదండ్రులు చిన్ననాటి నుంచి అలవాటు చేసిన మంచి సుగుణమే తన సేవలకు తొలి కారణమని ఆమె చెప్పారు. ప్రస్తుతం తాను స్వీకరిస్తున్న ఈ సత్కారం, అవార్డు తన బాధ్యతను భవిష్యత్తులో మరింతగా పెంచిందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ అధికారిగా తన సర్వీసు ఆఖరి వరకూ ఆ తర్వాత కూడా ప్రజాసేవలో రాజీలేకుండా ముందుకి సాగాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వీరమోహన్, మల్లిక్, రవిగోడే, తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు