ప్రజలకు పారదర్శకంగా సేవలందాలి..
Ens Balu
1
Srikakulam
2020-09-19 15:41:06
శ్రీకాకుళం జిల్లా పిఎన్ కాలనీ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ జె నివాస్ శనివారం తనిఖీ చేశారు. సచివాలయం నుంచి అందుతున్న సేవలను పరిశీలించారు. ప్రభు త్వ పథకాలకు సంబంధించిన పోస్టర్లు, ఇతర సమాచారం, లబ్ధిదారుల జాబితాలు ప్రజల పరిశీలనకు ప్రదర్శించారా ? లేదా అని గమనించారు. వాలంటీర్లు, సచివాల య సిబ్బంది కోవిడ్ సందర్భంగా చేపట్టిన ఇంటింటి సర్వే చేసిన పరిస్థితిని తనిఖీ చేశారు. సర్వేలో ఏ ఒక్కరిని విడిచి పెట్టలేదని తద్వారా కోవిడ్ లేకుండా నిర్మూలించవచ్చని జిల్లా కలెక్టర్ అన్నారు. వైరస్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని సూచిస్తూ అనారోగ్యం బారిన ఉన్నవారు ఏ ఒక్కరూ ఇంటివద్ద ఉండరాదని అన్నారు. కొంతమంది కరోనా పరీక్షలకు ముందుకు రావడం లేదని వాలంటీర్లు, సిబ్బంది జిల్లా కలెక్టర్ కు తెలియజేయగా అటువంటి వారి వద్ద నుండి ప్రభుత్వం నుండి ఎటువంటి సేవలు అవసరం లేదని వ్రాతపూర్వకంగా తీసుకో తీసుకోవాలని సూచించారు. తీవ్ర అస్వస్థతకు గురైన ప్పుడు ఎటువంటి సహాయం అందే పరిస్థితి ఉండదని గమనించాలని, అది స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. వాలంటీర్ల, సిబ్బంది మంచి సేవలు అందిస్తున్నారని కలెక్టర్ ప్రశంసించారు. వృత్తిలో మంచి సేవలు అందించడం లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన సూచించారు. ప్రజలకు మంచి సేవలు అందించడమే పరమావధి, తద్వారా సంతృప్తి కలుగుతుందని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు, బియ్యం కార్డు, పింఛను, ఆరోగ్యశ్రీ కార్డు అందించడంలో ఎటువంటి జాప్యం జరగ రాదని ఆయన ఆదేశించారు. ఈ నాలుగు అవసరాలకు ఎక్కువ మంది సచివాలయానికి వస్తారని వారికి మెరుగైన సేవలు అందించి పంపించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో సేవలు అండాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతి పథకానికి ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన వారిని గుర్తించాలని అటువంటి జాబితాను సచివాలయం వద్ద ప్రదర్శించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన స్పష్టం చేశారు. పథకాల అమలులో పారదర్శకత స్పష్టంగా ఉండాలని అదే ప్రభుత్వ విధానమని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సేవలు వారి వద్దకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్న సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. సచివాలయాల ఏర్పాటు అందులో భాగమేనని అన్నారు. యువతగా అద్భుతమైన పనితీరు కనిపించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ పి.నల్లనయ్య, ఆరోగ్య అధికారి డాక్టర్ వెంకట రావు , ఆయుష్ వైద్య అధికారి సి.హెచ్. మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.