హెలీపాడ్ వద్ద సీఎంకి ఘన స్వాగతం


Ens Balu
6
Srikakulam
2022-06-27 07:45:10

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి కి శ్రీకాకుళం హెలీపాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. జగనన్న అమ్మ ఒడి పథకం తల్లుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయుటకు సోమవారం ఆయన జిల్లాకు చేరుకున్నారు. ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన హెలీపాడ్ కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు. ఘన స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా పరిషత్ అధ్యక్షులు పిరియా విజయ, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, డిఐజి హరికృష్ణ, జిల్లా ఎస్పీ రాధిక, విజయనగరం పార్లమెంటు సభ్యులు కె. చంద్రశేఖర్, ఉప ముఖ్యమంత్రి,  నరసన్నపేట శాసన సభ్యులు ధర్మాన కృష్ణదాస్, శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్, పాలవలస విక్రాంత్, శాసన సభ్యులు వి. కళావతి, గొర్లె కిరణ్ కుమార్, రెడ్డి శాంతి, కంబాల జోగులు, డిసిసిబి అధ్యక్షలు కరిమి రాజేశ్వరరావు, కాళింగ కార్పొరేషన్ అధ్యక్షులు పి. తిలక్, కళింగ కోమటి కార్పొరేషన్ అధ్యక్షులు అందవరపు సూరిబాబు, కాపు కార్పొరేషన్ అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత, సీతంపేట ఐటిడిఎ పిఓ బి. నవ్య, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య, తదితరులు పాల్గొన్నారు.