విద్యార్ధుల కోసం ఆధార్ శిబిరాలు
Ens Balu
2
Kakinada
2022-06-28 14:47:04
కాకినాడ జిల్లాలో ఈ నెల 29న పాఠశాల విద్యార్ధుల కోసం ప్రత్యేక శిభిరాలు ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. అధార్ సేవలు అందుబాటులో ఉన్న 37 గ్రామ, వార్డు సచివాలయాల్లో వీటిని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆధార్ నిబంధనల కనుగుణంగా జిల్లాలో 5 నండి 15 సంవత్సరాల వయస్సు పిల్లలు చేతి వేలి ముద్రల బయోమెట్రిక్స్ అప్ డేషన్ తో పాటు, ఇప్పటి వరకూ ఆధార్ నమోదు చేసుకోని వారికి నమోదు, ఇతర ఆధార్ సంబంధిత సేవలు పొందేందుకు ఈ ప్రత్యేక శిభిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయా సచివాలయాల పరిధిలోని పాఠశాల విద్యార్థులు 29వ తేదీన ఈ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.