2వ దశ నాడు-నేడు త్వరగా పూర్తిచేయాలి


Ens Balu
6
Kakinada
2022-06-28 15:00:12

మనబడి నాడు-నేడు 2వ దశ పాఠశాల పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టరు కృతికా శుక్లా.. జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష, ఏపీ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఈడబ్ల్యూఐడీసీ), పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్ తదితర శాఖల అధికారులతో రెండోదశ మనబడి నాడు-నేడు పనుల పురోగతి, సిమెంట్ ఇతర మెటీరియల్ సరఫరా, పాఠ్యపుస్తకాల పంపిణీ వంటి అంశాలపై జిల్లాలోని అన్ని మండల విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఫీల్డ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో రెండవ దశ మనబడి  నాడు-నేడు కార్యక్రమం కింద 663 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ పాఠశాలలో జరుగుతున్న పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. మండల విద్యాశాఖ అధికారులు పనులు పూర్తయిన వెంటనే బిల్లు అప్లోడ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. 

అదేవిధంగా మండలాల వారిగా ఫీల్డ్ ఇంజనీర్, ఎంఈఓ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి  ఎన్ని చోట్ల అదనపు తరగతులు అవసరమో గుర్తించి, వివరాలు తెలపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎక్సపండెచర్ ను నిర్దేశిత సమయంలో ఖర్చుచేసి పనుల్లో పురోగతి చూపాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. జిల్లాలో పాఠశాలలు త్వరలో పునఃప్రారంభం కానున్నందున మండలాల వారీగా పాఠశాల ఇండెంట్ ప్రకారం సకాలంలో పాఠ్యపుస్తకాల పంపిణీ సక్రమంగా జరిగే విధంగా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. రెండో దశ పాఠశాల పనులకు సంబంధించి అవసరమైన సిమెంటు ఇతర మెటీరియల్ అందుబాటులో ఉండే విధంగా మండల విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి.సుభద్ర, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈఈ వి. లక్ష్మణ రెడ్డి, జిల్లా సమగ్ర శిక్ష ఈఈ డి. నటరాజన్, నగరపాలక సంస్థ సూపరింటిండెంట్ ఇంజనీర్ పి. సత్యకుమారి, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ సూపరిండెండెంట్ ఇంజనీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.