శ్రీకాకుళం జిల్లాలో అన్ని శాఖలలో కనీస వేతనాలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కనీస వేతనాల అమలు పై బుధవారం ఆయన సమీక్షించారు. అన్ని ఇంజనీరింగ్ శాఖలలో కనీస వేతనాలు అమలు పై చర్చించారు. ఇంజనీరింగ్ శాఖలతో పాటు డ్వామా, వ్యవసాయం, పట్టు పరిశ్రమ, కార్మిక, వైద్య ఆరోగ్య శాఖ, ఉద్యానవన, మున్సిపల్ కార్పొరేషన్, తదితర శాఖల అధికారులతో ఆయన కనీస వేతనాలు పై చర్చించారు. ప్రస్తుతం అన్ని శాఖలలోను కనీస వేతనాలు అమలు జరుగుతున్నట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, సిపిఓ లక్ష్మీ ప్రసన్న, డ్వామా పీడీ రోజారాణి, వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్, పట్టు పరిశ్రమ శాఖ ఎడి అలజంగి విక్టర్ సాల్మన్ రాజు, పరిశ్రమల శాఖ డిడి ఉమామహేశ్వరరావు, వైద్య ఆరోగ్య శాఖ నుండి డాక్టర్ కృష్ణ మోహన్, ఉద్యానవన శాఖ ఎడి ప్రసాదరావు, కార్మిక శాఖ నుండి శైలేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.