సులభతరం వాణిజ్యంలో మొదటి స్థానం
Ens Balu
4
Srikakulam
2022-07-01 15:23:07
అన్ని శాఖల భాగస్వామ్యంతో దేశంలోనే సులభతరం వాణిజ్యం మొదటి స్థానం సాధించ డం చాలా సంతోషంగా ఉందని అదే స్ఫూర్తితో కొనసాగించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పరిశ్రమలు, ఎగుమతుల ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ జిల్లాలో పోల్యుషన్ ప్రపోజల్స్ పెండింగులో ఉన్నాయని ఎస్.ఎల్. ఎ పీరియడ్ దాటకుండా చూడాలన్నారు. పలాసలో నక్క ప్రవీణ్ కుమార్ పైప్స్ పరిశ్రమ నిమిత్తం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, అందుకు సంబంధించిన అధికారులు పర్యవేక్షించి లోన్ మంజూరు చేయడం జరిగిందని, అయితే పరిశ్రమకు విద్యుత్ అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది అని తెలిపారు. అందుకు సంబంధించి బ్యాంక్ వారి అనుమతితో స్థలాన్ని మార్పు చేయు నిమిత్తం అనుమతులు కోరగా జిల్లా కలెక్టర్ మంజూరు తెలియజేశారు. ప్రస్తుతం పరిశ్రమలు నడుపుతున్న యూనిట్స్ అందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటుచేసి ఇతర పరిశ్రమలకు 10, 15 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తే ఉపాధి కల్పించడానికి అవకాశం ఉందన్నారు. ఋణాలు తీసుకున్న పరిశ్రమలు ఋణాల రాయితీ పొందుతున్న వారు మంజూరు చేసిన ఋణం మొత్తం పరిశ్రమలలో పెట్టుబడి పెట్టారా లేదా అన్న విషయం పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో డి.ఐ.ఓ ఉమామహేశ్వర రావు, అగ్నిమాపక శాఖ అధికారి, డిపిఓ రవికుమార్, సేఫ్టీ అధికారి, పరిశ్రమల శాఖ ఎడి ఆర్ వి రమణ రావు, ఎడి రఘునాథ్, వివిధ పరిశ్రమల అసోషియేషన్, తదితరులు పాల్గొన్నారు.