ఘనంగా AIIEA 72వ ఆవిర్భావ దినోత్సవం


Ens Balu
5
Visakhapatnam
2022-07-01 15:33:58

ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 72వ ఆవిర్భావ దినోత్సవం విశాఖలోని ఎల్ఐసీ ప్రధానకార్యాలయంలో ఘనం జరిగింది. ఈ సందర్భంగా  ఏఐఐఈఏ జెండాను సీనియర్‌ ఉద్యోగి పి.వెంకట రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  హాజరైన మాజీ ఎమ్మెల్సీ  ఎంవిఎస్‌ శర్మ  మాట్లాడుతూ, ఎల్ఐసీ ఆఫ్ ఇండియా ఉనికిలోకి రాకముందే 17-1951న AIIEA ఏర్పడిందని గుర్తుచేశారు. దీనికింద 245 ప్రైవేట్ బీమా కంపెనీలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయని చెప్పారు. నాటి నుంచి ప్రభుత్వ రంగ ఇన్స్యూరెన్సు సంస్థను  రక్షించడానికి విశేషంగా క్రుషి చేస్తుంటే.. కానీ నేడు, ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగాలను అమ్మేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నాయని, అయితే అధికార బీజేపీ ఎప్పుడూ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదన్నారు. ఈ విభజన శక్తులను ఓడించి ఐక్యంగా ఉండటమే నేడు యూనియన్ సభ్యుల ముందున్న ప్రధాన సవాల్ అన్నారు.  దేశ ప్రజలను ఐక్యం చేసేందుకు, ప్రభుత్వ రంగ బీమాను పరిరక్షించేందుకు బీమా ఉద్యోగులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జి వరప్రసాదరావు, గేట్ మీటింగ్‌ ఐసిఇయు అధ్యక్షురాలు ఎం.కామేశ్వరి అధ్యక్షత వహించారు. సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.