మానవాళి మేలు కోసమే ప్రేరణ ప్రాజెక్టు


Ens Balu
9
Visakhapatnam
2022-07-04 14:02:26

మానవాళి మేలు కొరకు ప్రజాపిత  బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 700 కోట్ల ప్రజలకు మేలుచేసే  ప్రేరణ ప్రాజెక్టుకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుందని ఆల్‌ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అప్పిలేట్ అథారిటీ (ఏఐసిటిఈ)చైర్మన్ ఆచార్య జిఎస్ఎన్ రాజు పేర్కొన్నారు. సోమవారం వి.జె.ఎఫ్. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బ్రోచర్లను రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ మేలు జరగాలన్నదే ఈ ప్రాజె క్టు ప్రధాన లక్ష్యమన్నారు. ఇందు కోసం 700కోట్ల మంది ప్రజలు ఒక్కోక్క పని చేస్తే అందరికీ సంతోషం కలుగుతుందన్నారు. అది సేవలు, సహయం, ఇలా ఏ రూపంలోనైనా సాటివారికి మేలు చేసేదిగా ఉండాలన్నారు.  ప్రాజెక్టు నిర్వాహకులు రామ్ సింఘాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని యూఎస్ లో ప్రారంభించారని తెలిపారు. ఇప్పటికి
40 దేశాల్లో 30 వేల కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. ముఖ్యంగా విద్యా సంస్థలలో విద్యార్థులను కలిసి ఈ ప్రాజెక్టు ద్వారా వారిలో మార్పు తీసుకొచ్చేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని వెల్లడించారు. అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు ,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ యూఎస్ లో ఒక చిన్న కార్యక్రమంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు నేడు 40 దేశాలకు విస్తరించడం జరిగిందన్నారు.ఏడు వందల కోట్ల సత్కర్మలకు ప్రేరణ ప్రాజెక్టు నిర్వహణ ద్వారా ప్రజాపిత బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఒక అద్భుతమైన ముందడుగు వేసిందని పేర్కొన్నారు.

 ప్రజలకు ఆనంతమైన ఆత్మీయ సంతోషం కలుగుతుందనే ఆలోచనతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు
ప్రాజెక్టు నిర్వాహకులు రామ్ సింఘాల్, సోదరి శివలీల మాట్లాడుతూ ఎంతో అద్భుతమైన కార్యక్రమాలను ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహించే ఒక మంచి అవకాశం రావడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ ప్రాజెక్టును దిగ్విజయంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ప్రపంచ శాంతికి అలాగే ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశించిన  ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం ప్రతినిధులు బికె రామేశ్వరి,  సోదరి సత్యవతి, శశికళ, లలిత తదితరులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రాజెక్టుకు విశేష ప్రచారం కల్పించాలన్నదే బ్రహ్మకుమారీస్‌ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా ఆచార్య రాజును ఘనంగా సత్కరించారు.