భరతమాత ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు


Ens Balu
3
Vizianagaram
2022-07-04 14:15:34

భారత స్వాతంత్రోద్యమంలో అల్లూరి సీతారామరాజు చేసిన సేవ, చూపిన తెగువ, మన్యం ప్రజల హక్కుల హక్కుల కోసం పోరాడి 27 ఏళ్ల చిరుప్రాయంలోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ పరిపాలనాధికారి డాక్టర్ ఎన్విఎస్ సూర్యనారాయణ కొనియాడారు. విజయనగరం జల్లా కొండకారకంలో గల సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈరోజు జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణ అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ సమయంలో బ్రిటిష్ దొరలపై అల్లూరి సీతారామరాజు చూపించిన వీరత్వం తెగువ అప్పటి ప్రజలను ఆకట్టుకున్నాయని అతడు బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయి వారికి కంటిమీద కునుకు లేకుండా చేశాడని అలాంటి విప్లవ వీరుడు 27 సంవత్సరాలకే దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని డాక్టర్ సూర్యనారాయణ తెలిపారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు అల్లూరి సీతారామరాజు చరిత్ర వీడియో ద్వారా ప్రదర్శించి సీతారామరాజు జీవిత చరిత్రను అతని తెగువను దేశం కోసం అతను ప్రాణత్యాగం చేసిన విధానాన్ని విద్యార్థులకు వివరించారు.  ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్స్లర్ వ్యక్తిగత కార్యదర్శి సుప్రియ దాస్, సెక్షన్ ఆఫీసర్ బానోతు రాము, డాక్టర్ పి వి పి ఎస్ అరుణ్, డాక్టర్ దేవాంజన నాగ్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.