28 గ్రామ పంచాయితీలో రీసర్వే పూర్తి
Ens Balu
5
Rajamahendravaram
2022-07-04 15:48:20
తూర్పుగోదావరి జిల్లాలో జగనన్న భూహక్కు భూరక్ష పథకంలో భాగంగా చేపట్టిన రీసర్వే పనులను ప్రామాణికత తో కూడి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత అధికాలను ఆదేశించారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరు ఛాంబరులో రీసర్వే అశంపై సర్వే, పంచాయితీ , రెవెన్యూ అధికారులతో కలెక్టరు మాధవీలత జాయింట్ కలెక్టరు సీహెచ్ శ్రీధర్ తో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో 272 గ్రామాల్లో రీసర్వే పనులను ప్రారంభించగా ఇప్పటి వరకు 28 గ్రామాల్లో సర్వే పూర్తి చేశామన్నారు. రీసర్వేలో భాగంగా ఇంత వరకు 73 గ్రామాల్లో డ్రోన్ సహాయంతో సర్వే చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 28 గ్రామాల్లో సమగ్ర సర్వే అనంతరం 13 నోటిఫికేషన్ ఇచ్చి సర్వే పూర్తి చేశామని తెలిపారు. రెవిన్యూ గ్రామాల పరిధిలో ఫ్రీ జోన్ యాక్టివీటీస్ కింద భూముల హద్దులను సంప్రదాయ పద్ధతిలో సున్నం మార్కింగ్ చేపట్టి సకాలంలో పూర్తి చేశామన్నారు. 43 గ్రామాల్లో ఓఆర్(ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ ) ఇచ్చిన వంద రోజుల్లో సర్వే పూర్తి చేయాలని అధికారులకు సూచించామన్నారు . 21 గ్రామాల్లో డ్రాఫ్టు ఆర్వోఆర్ పూర్తి చేసినట్లు తెలిపారు. రాజమహేంధ్రవరం డివిజన్ లోని కడియం మండలంలో 7, గోకవరంలో 15, రాజానగరంలో 14, రంగంపేటలో 14, సీతానగరంలో 17, కోరుకొండలో 19, రాజమహేంధ్రవరం రూరల్ మండలంలో 7 గ్రామాల్లో డ్రోన్ ప్లే ద్వారా కవర్ చేశామని తెలిపారు. ప్రతి వారం రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు రీసర్వే అంశంపై సమీక్షలు నిర్వహిస్తున్నారని అధికారులు రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఏమైనా సందేహాలు ఉంటే సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టరు సిహెచ్. శ్రీధర్, ఆర్డీవో ఏ.చైత్రవర్షిణి, ఎడీ సర్వే లక్ష్మణరావు, జిల్లా పంచాయితీ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.