బి.సి. సంక్షేమానికి రూ.29.800 వేల కోట్లు..


Ens Balu
2
Simhachalam
2020-09-19 18:17:45

రాష్ట్రంలో బలహీన వర్గాల అభ్యున్నతికి  ప్రభుత్వం రూ.29 వేల 800 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు  బి.సి. సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. శనివారం ఆయన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి వి.త్రినాధరావు మంత్రికి స్వాగతం పలికారు. వేదపండితులు పూర్ణకుంభంతో స్వామివారి దర్శనం, అర్చన చేయించారు. అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ  బడుగు, బలహీన వర్గాల వారిలో ఆత్మనూన్యతా భావాన్ని తొలగించి, వారిలో ఆత్మస్థైర్యం నింపేలా  ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. బి.సి.ల అభ్యున్నతికి  56 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని, దాన్ని ఆయన  బిసి సంక్షేమ ఉద్యమంగా అభివర్ణించారు. అర్హత గల వారందరికీ సబ్సిడిపై బ్యాంకు లోన్లు, ఫీజు రీఇంబర్స్ మెంట్, ఉపకారవేతనాలను అందజేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  పూర్తి పారదర్శకంగా , ప్రజారంజకమైన పరిపాలన అందిస్తున్నారని చెప్పారు. హిందూ ధర్మరక్షణకు, హిందువుల మనోభావాల రక్షణకు ప్రభుత్వం కట్టుబడివుందన్నారు.  రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వ కర్తవ్యమని, ఎటువంటి పరిస్థితుల్లో రాజీపడరని వెల్లడించారు. ముఖ్యమంత్రి తలంపులకు  స్వామివారి ఆశీస్సులను కోరుతూ పూజలు నిర్వహించినట్లు చెప్పారు.