సర్వపాపహరణం నారసింహుని దర్శనం
Ens Balu
2
Visakhapatnam
2022-07-05 06:24:27
విశాఖలోని పాతనగరం లో కొలువున్న శ్రీ జగన్నాథ స్వామి దశావతార మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వరాహ, నారసింహ అవతారాల్లో జగన్నాథుడు భక్తులకు దర్శనం కల్పించి కనువిందు చేస్తున్నారు. మంగళవారం నారసింహ అలంకరణలో జగన్నాథుడు భక్తులకు దర్శనం ఇవ్వగా దర్శించుకున్నవారంతా భక్తిభావంతో పులకించిపోయారు. వరాహ ,నారసింహ అవతారాలలో ఉన్న జగన్నాథ స్వామిని ఎవరైతే దర్శించుకుంటారో అటువంటి భక్తులు సర్వ పాపాలు హరించుకుపోయి ,వారి కుటుంబాలు సుఖ సంతోషాలు, భోగభాగ్యాలతో కలకాలం చల్లగా ఉంటాయని అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు. ఈ మేరకు నారసింహావతారం లో ఉన్న జగన్నాధుడుని మంగళవారం దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకంలో ఉన్న ప్రజలందరినీ సుభిక్షంగా స్వామి చల్లగా కాపాడాలని శ్రీను బాబు ఆకాంక్షించారు. గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని స్వామి ని వేడుకున్నట్లుగా శ్రీనుబాబు ఈ సందర్భంగా మీడియాకి చెప్పారు.