విశాఖలోనూ జగనన్న మహిళా మార్ట్


Ens Balu
8
జివిఎంసీ
2022-07-05 07:47:25

విశాఖ మహా నగరంలో మహిళా మార్ట్ ప్రారంభానికి జివిఎంసి కమిషనర్ సూచనల మేరకు మల్కాపురంలో సన్నాహాలు చేస్తున్నట్లు సోమవారం యుసిడి(పి.డి.), కె.వి. పాపు నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలకు ఆర్ధిక స్వాలంబన సాధించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మెప్మా వారి ఆధ్వర్యంలో ఇదివరకే తిరుపతి, చిత్తూరు, గూడూరు, పులివెందుల, అద్దంకి తదితర ప్రాంతాలలో జగనన్న మహిళా మార్ట్ ను ప్రారంభించారని తెలిపారు. కమిషనర్ సూచన మేరకు జివిఎంసి పరిధిలో మల్కాపురంలో ఈ మార్ట్ కి మంచి గిరాకీ ఉంటుందని అందువలన మల్కాపురం లో జగనన్న మహిళా మార్ట్ ఏర్పాటు చేయుటకు సన్నాహాలు చేయడం జరిగిందని తెలిపారు. దీనిలో భాగంగా స్వయం సహాయక సంఘాలు(ఎస్.హెచ్.జి.), స్లం లెవల్ ఫెడరేషన్(ఎస్.ఎల్.ఎఫ్.) మరియు టౌన్ లెవల్ ఫెడరేషన్(టి.ఎల్.ఎఫ్) సభ్యుల నుంచి వాటాదనం రూ. 110/-లు మరియు సభ్యత్వ రుసుం కింద రూ.40/- లు, ఒక్కొక్కరికి మొత్తం రూ. 150/-లు చొప్పున మహిళా పరస్పర సహకార సంఘంలో రిజిస్ట్రేషన్ కాబడి, ఈ మార్ట్ ద్వారా అన్ని రకాల మహిళా సంఘాల ఉత్పత్తులు మరియు నిత్యావసరాలను విక్రయిస్తారని, ఇందులో సభ్యులే అన్ని బాధ్యతలూ నిర్వహిస్తారని తద్వారా వారి ఆర్ధిక అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.