సచివాలయ మెటీరియల్ స్టాక్ పాయింట్ సందర్శన
Ens Balu
3
Srikakulam
2020-09-19 18:32:49
శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల నియామక పరీక్షల ఏర్పాట్లను సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు శనివారం పరిశీలించారు. స్థానిక జిల్లా పరిషత్ లో ఏర్పాటుచేసిన సచివాలయ పరీక్షల మెటీరియల్ స్టాక్ పాయింట్ ను జె.సి సందర్శించారు. అనంతరం మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. తొలుత మండలాల వారీగా సచివాలయ పరీక్షల మెటీరియల్ పంపిణీ వివరాలను జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జి.చక్రధర రావుని అడిగి తెలుసు కున్న ఆయన మెటీరియల్ తీసుకున్న రూట్ అధికారులకు జె.సి పలు సూచనలు చేశారు. మెటీరియల్ ఉన్న వాహనాలు ఎక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా గమ్యస్థానాలకు చేరుకోవాలని, ఇందుకు రూటు అధికారులు బాధ్యత వహించాలని అన్నారు. ఒక్కో మండలానికి ఒక్కో కోడ్ కేటాయించడం జరిగిందని, తమకు కేటాయించిన మెటీరియల్ సరిపోయినది లేనిదీ పరిశీలించుకోవలసిన బాధ్యత కూడా రూట్ అధికారులపై ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి జి.చక్రధరరావు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, ఏ.కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.