రీసర్వే పనులు వేగవంతం చేయాలి


Ens Balu
7
Kakinada
2022-07-05 11:04:59

జగనన్న భూ హక్కు భూ రక్ష కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపడుతున్న రీ సర్వే వేగవంతం చేసి పూర్తి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టరు డా.కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టరు కృతికా శుక్లా.. జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియ, రెవెన్యూ, సర్వే శాఖల అధికారులతో కలిసి సర్వే పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో జరుగుతున్న సర్వే పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. కాకినాడ డివిజన్ కి సంబంధించి డ్రోన్ సర్వే పనులు జూలై నెల చివరి నాటికి, పెద్దాపురం డివిజన్ కి సంబంధించి అక్టోబర్ నెల చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. రీ సర్వే నిర్వహణలో సరిహద్దులు గుర్తింపులో ఎటువంటి గందరగోళానికి చోటివ్వకుండా స్పష్టంగా రీ సర్వే పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సమావేశంలో సర్వే ఎడీ బి.లక్షీనారాయణ, కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు బీవీ.రమణ, జే.సీతారామరావు, పెద్దాపురం డీఐఓఎస్ ఎం.జ్యోషిల ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.