అప్పన్న గిరి ప్రదక్షిణకు రూట్ మ్యాప్


Ens Balu
1
Visakhapatnam
2022-07-07 10:29:55

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ వరాలక్ష్మీ నారసింహ స్వామివారు(సింహాద్రి అప్పన్న) గిరి ప్రదక్షణ చేయడానికి దేవస్థానం అధికారులు రూట్ మ్యాప్ ని ప్రకటించారు. ఈ మొత్తం రూట్ మ్యాప్ లో భక్తులకు ఎలాంటి ఇబ్బదులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కోవిడ్ లో రెండేళ్ల పాటు నిలిపివేసిన ఈ సింహగిరి ప్రదక్షిణ మళ్లీ ఈ సారి దేవస్థానం అధికారులు ప్రారంభిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ గిరి ప్రదక్షిణ కోసం మొత్తం 25 ప్రాంతాల్లో స్టాల్స్, పది ప్రదేశాల్లో మెడికల్ క్యాంపులు, 22 ప్రదేశాల్లో 200 టాయిలెట్లు, 12 చోట్ల 17 అంబులెన్సులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు స్వచ్ఛంద సంస్థలు మంచినీరు, మజ్జిగ, ప్రసాదాలు అందించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణ జరుగుతున్నందున భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే సంకల్పంతో అధికారులు సర్వం సిద్దం చేశారు. గిరి ప్రదక్షిణ ఏఏ ప్రాంతాలు మీదుగా సాగుతుందనే విషయాన్ని తెలియజేయడానికి ఒక రూట్ మ్యాప్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ రూట్ మ్యాప్ ద్వారా ప్రజలకు మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నది.