విజయనగరం స్పందనకు 220 దరఖాస్తులు
Ens Balu
6
Vizianagaram
2022-07-11 09:37:15
విజయనగరం కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన స్పందన కు ప్రజల నుండి 220 వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 41, డి.ఆర్.డి.ఏ కు 13, అందగా రెవిన్యూ కు సంబంధించి 166 వినతులు అందాయి. ముఖ్యంగా సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులను సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, ఉప కలెక్టర్ పద్మా వతి, స్వీకరించారు. అనంతరం జె.సి మయూర్ అశోక్ అధికారులతో మాట్లాడుతూ గడువు దాటి పెండింగ్ ఉన్న అర్జీలను శాఖల వారీగా సమీక్షించారు. రీ ఓపెన్ అయిన వాటిని తక్షణమే తగు సమాధానాలు రాసి అర్జీలను డిస్పోజ్ చేయాలంబరు. జిల్లా అధికారులే కాకుండా శాఖ లో నున్న విభాగాల అధికారులు కూడా వారి లాగిన్ లో స్పందన అర్జీలను తనిఖీ చేయా లన్నారు. మండలాల్లో మంగళవారం ప్యాత్యేకాధికారులు నిర్వహించనున్న సమీక్షల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు పై ఆడిట్, గృహ నిర్మాణాల పురోగతి పై సమీక్షించాలన్నారు. విత్తనాల సరఫరా పై ప్రత్యేకంగా సమీక్షించా లన్నారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సక్రమంగా సరఫరా జరిగేలా చూడాలన్నారు. రీ సర్వే ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు.