వరదల్లో ముందస్తు చర్యలు చేపట్టాలి


Ens Balu
2
Anakapalle
2022-07-12 10:15:49

రాష్ట్రంలో నదుల పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున వరద  ముందస్తు చర్యలను చేపట్టాలని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.  ఈ విషయమై ఆయన మంగళవారం తాడేపల్లి నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదలు, ముంపు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాల వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలన్నారు. నదులు జలాశయాల గట్లు పరిశీలించి పటిష్టం చేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లో తగిన ఆహారం, పాలు, తాగు నీరు, మందులు సిద్ధంగా ఉంచాలన్నారు. గోదావరి ముంపు ప్రాంత జిల్లాల కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అనకాపల్లి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి, పోలీసు సూపరింటెండెంట్ గౌతమి సాలి, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.