గోదావరికి వరద, గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేని వానలు కారణం గా ప్రజలకు తాగు నీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక హెడ్ వాటర్ వర్క్స్,ధవళేశ్వరం లోని వాటర్ వర్క్స్ పనులను ఆయన పరిశీలించారు. రెగ్యులర్ గా చేసే క్లోరినేషన్ ప్రక్రియ,శుద్ధి చేస్తున్న ప్రక్రియ, త్రాగునీరు సరఫరా చేసే దశలను క్షుణ్ణం గా పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు మంచి నీటి కొరత రాకూడదని అన్నారు. వాటర్ ట్యాంక్ ల స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. సిజనల్ వ్యాధుల వ్యాప్తి కి త్రాగునీరు ఒక ప్రధాన కారణం అని, ఆ విషయం తెలుసుకునే అత్యంత నీటి సరఫరా విషయం లో జాగ్రత్తలు తీసుకోవసిందిగా ఆదేశించారు. కమిషనర్ వెంట ఎస్.ఈ. పాండు రంగారావు, ఈ ఈ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.