ప్రసాద వితరణ సేవలో ఎమ్మెల్సీ వంశీ
Ens Balu
8
Visakhapatnam
2022-07-12 15:47:30
సింహగరి ప్రదక్షిణను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో 32 కిలోమీటర్ల నడిచి దేవదేవుడు సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకుంటారని ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ అన్నారు. మంగళవారం గిరిప్రదక్షిణ సందర్భంగా విశాఖలోని హనుమంతువాక జంక్షన్ ,పందుల ఫామ్, పైనాపిల్ కాలనీ , దీన దయాళ్ పురం, స్కిల్ డెవలప్మెంట్, వెంకోజిపాలెం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, అప్పన్న స్వామి కొలువుతీరిన సింహగిరి చుట్టూ ప్రదర్శన చేస్తే పుణ్యం సిద్ధిస్తుందన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అప్పన్న స్వామి ఆశీస్సులతో మరింత ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండాలని స్వామిని కోరుకుంటున్నట్టు చెప్పారు. భక్తులకు అందించే ప్రసాదాన్ని పరిశీలించి, వారితో కాసేపు పనిచేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.