విజయనగరంలో 16న మోటార్ సైకిళ్లు వేలం
Ens Balu
2
Vizianagaram
2022-07-12 16:03:19
విజయనగరం జిల్లాలో వివిధ కేసుల్లో ఎక్సైజ్ శాఖ స్వాధీనం చేసుకున్న మూడు మోటార్ సైకిళ్లను ఈ నెల 16న వేలం వేయనున్నట్లు, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, విజయనగరం-1 స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఒక ప్రకటలో తెలిపారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటిండెంట్ డి.శైలజారాణి ఆధ్వర్యంలో జరిగే ఈ వేలం ప్రక్రియ, విజయనగరం, ఎస్ఇబి-1 స్టేషన్ ఆవరణలో ఉదయం 10 గంటలకు జరుగుతుందని తెలిపారు. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (2017 మోడల్), హీరో గ్లామర్ (2018 మోడల్), హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (2007 మోడల్) మోటార్ సైకిళ్ల వేలయం వేయడం జరుగుతుందని, ఆసక్తి ఉన్నవారు ఈ వేలంలో పాల్గొనాలని కోరారు.