సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన..
Ens Balu
3
Visakhapatnam
2022-07-13 11:48:10
విశాఖలో ఈనెల 15వ తేదీన జిల్లాలో నిర్వహించు వాహన మిత్ర కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు అవుతున్నందున అందుకు అవసరమైన ఏర్పాట్లు గావించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ .మల్లికార్జున అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి రాక సందర్భముగా బుధవారం ఉదయం కలెక్టర్ , పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ తో కలిసి ఏ ఎస్ ఎల్ నిర్వహించారు . ముందుగా ఎయిర్ పోర్ట్ లో పోలీస్ ,రెవెన్యూ ,ఎయిర్ పోర్ట్ అధికారులతో సమావేశం అయ్యారు. ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి రాకకు ప్రోటోకాల్ నిబంధనల ప్రకారము చేపట్టవలసిన ఏర్పాట్లను చర్చించారు . తదుపరి విమానాశ్రయం వెలుపల చేయవలసిన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు . అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ చేరుకుని అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు . ముఖ్యమంత్రి రాక , స్టాల్స్, ఫోటో సెషన్ , స్టేజి తదితర ఏర్పాట్లపై చర్చించి పలు సూచనలు గావించారు. అనంతరం కలెక్టర్ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు త్వరత గతిన జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 25 వేల మంది పాల్గొంటారని వెల్లడించారు. వర్షం వచ్చినా సరే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు, ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.