సచివాలయాలతో అద్భుత ఫలితాలు


Ens Balu
7
East Godavari
2022-07-13 13:52:25

ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను త్వరితగతిన ప్రజలకు చేరవేయడం లో సచివాలయ వ్యవస్థ  పనితీరు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయాని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం అనపర్తి నియోజక వర్గ స్థాయి సమీక్ష సమావేశం ను స్థానిక శాసన సభ్యులు సత్తి సూర్య నారాయణ రెడ్డి తో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజక వర్గంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులు కోసం ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం అవ్వడం ద్వారా లక్ష్యాలను సాధించడానికి సానుకూలత సాధ్యం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి ఒక గొప్ప ఆలోచనతో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ములకల్లంక గ్రామం లో నిన్నటి రోజున జరిగిన సంఘటన పై మాట్లాడుతూ, గతంలో వరదలు, ప్రకృతి విపత్తులు వొచ్చిన సమయంలో గ్రామ స్థాయి లో అధికారులకు, సిబ్బందికి విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేస్తే పనిచేసే వారన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు మానవ వనరుల పెరగడం వల్ల ప్రజలకు అందుబాటులో అధికారులు సిబ్బంది ఉండి ప్రభుత్వ సహాయం తక్షణమే వారికి చేరడం సాధ్యం అవుతోందని పేర్కొన్నారు.  నియోజక వర్గంలో అభివృద్ధి ప్రతి ఒక్కరి అటూ ప్రజా ప్రతినిధులు అధికారులు భాగస్వామ్యం లేకుండా సాధ్యం కాదని, ఇప్పటికే ఆదిశలో పురోగతి సాధించాగలిగామని చెప్ప వచ్చునని కలెక్టర్ పేర్కొన్నారు. వెల్ నెస్ కేంద్రాలు ద్వారా గ్రామంలోనే తక్షణ వైద్య సహాయం కోసం ప్రభుత్వం తీసుకున్న భవన నిర్మాణ పనులు మరో నూతన అధ్యాయం గా కలెక్టర్ అభివర్ణించారు.

అనపర్తి నియోజకవర్గం లో గ్రామ సచివాలయ భవనాలు 59 కు గాను 39 పూర్తి అయ్యాయని రైతు భరోసా కేంద్ర భవనాలు 59 కి గాను 18 వెల్నెస్ సెంటర్స్ 50 కి గాను 11 నిర్మించుకోవడం జరిగిందని కలెక్టర్ మాధవీలత తెలిపారు. మిగిలినవి వివిధ దశలో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా సచివాలయ వ్యవస్థను వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టిందని అన్నారు.  దీని ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలను వేగవంతంగా నిర్మించాలన్నారు. శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ  అనపర్తి నియోజకవర్గం లో అనపర్తి బిక్కవోలు రంగంపేట మండలాల్లో గృహ నిర్మాణ లబ్ధిదారుల అవగాహన కల్పించి ఇల్లు నిర్మాణాలు గ్రౌండ్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు ఇప్పటికే జిల్లాలో రాజానగరం నియోజకవర్గ మొదటి స్థానంలో ఉందని రెండవ స్థానంలో అనపర్తి నియోజకవర్గం నిలిపేందుకు కృషి చేస్తామని శాసనసభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గం లో గ్రామ సచివాలయాలు, ఆర్ బి కే, వెల్నెస్ సెంటర్ల భవనాలను నిర్మించేందుకు సహకరించిన  పలువురు గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, సర్పంచ్లను కలెక్టర్ సన్మానించారు. స్థానిక నియోజక వర్గం లోని ప్రజా ప్రతినిదులు, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.