వరద ఉద్రుతిపై అప్రమత్తంగా ఉండాలి
Ens Balu
10
Rajamahendravaram
2022-07-13 14:56:40
భద్రాచలం వద్ద వరద నీరు విడుదల చేయడం జరుగుతున్న దృష్ట్యా గురువారం సాయంత్రానికి 18 నుంచి 20 లక్షల క్యూసక్కుల నీరు ధవళేశ్వరం కు చేరుకునే అవకాశం ఉందన్నందున హెచ్చరికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం రాత్రి డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ అత్యవసర టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, వరదలు కారణంగా ప్రజా జీవనానికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు అన్ని తీసుకోవాలని అన్నారు. ఒక్క ప్రాణ నష్టం కానీ, జంతువుల నష్టం వాటిల్లకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలను అవసరమైతే బలవంతంగా నైనా తరలించాలని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల వద్ద ఏర్పాట్లు అన్ని పకడ్బందీ గా ఏర్పాటు చేయాలన్నారు. ఈ ముఖ్యమంత్రి స్పష్టం గా ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. రిలీఫ్ క్యాంపు ల వద్ద ఆహారం, త్రాగునీరు, దుప్పట్లు, మందులు తగినంత ముందస్తుగా సిద్దం చేసుకోవాలని, బడ్జెట్ కు ఎటువంటి ఇబ్బందులూ ఉండవని తెలిపారు. ఇరిగేషన్, హెడ్ వర్క్సు అధికారులు వరద నీరు వచ్చే స్థాయి పై పూర్తి గా అంచనాతో ఉండాలని, గంట గంటకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో బోబ్బర్లంక, సీతానగరం, మునికొడు, ములకల్లంక, మద్దూరులంక ప్రాంతాల్లో బండ్స్ ను తనిఖీ చేయ్యాలన్నరు. ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి అధికారులు క్షేత్ర స్థాయి లో పర్యటించి పరిస్థితి ని అంచనా వెయ్యలన్నారు. రహదారులకు , విద్యుత్ సరఫరా కు ఎటువంటి ఆటంకం లేకుండా సంబందించిన అధికారులు చర్యలు చేపట్టలని తెలిపారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, జేసీ శ్రీధర్ , ఆర్డీవో మల్లిబాబు, తదితరులు పాల్గొన్నారు.