భారత స్వాతంత్రోద్యమ స్ఫూర్తి గరిమెళ్ల
Ens Balu
20
Srikakulam
2022-07-14 08:25:37
భారత స్వాతంత్రోద్యమానికి తన గేయాలతో శత్తువ తీసుకువచ్చి ప్రజల్లో దేళభక్తిని పెంపొందించిన చైతన్య స్ఫూర్తి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోథులు గరిమెళ్ల నత్యనారాయణ అని వైఎస్సార్సీపీ నాయకులు ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు పేర్కొన్నారు. గురువారం గరిమెళ్ల 129వ జయంతి శ్రీకాకుళం శాంతినగర్ కాలనీ గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోథుల స్మ్రుతివనంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రామ్‌మనోవార్‌నాయుడు మాట్లాడుతూ, జిల్లాకు చెందిన గరిమెళ్ల స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ పిలువునందుకొని తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. కవి, రచయిత, జర్నలిస్టుగా గరిమెళ్ల సత్యనారాయణ స్వాతంత్ర్యకాంక్షను ప్రజల్లో రేకెత్తించే దిశగా మాకొద్దీ తెల్లదొరతనమంటూ నినదించారని కొనియాడారు. గరిమెళ్ల మన జిల్లాలో జన్మించడం అదృష్టమని పేర్కొన్నారు. భావితరాలకు స్వాతంత్రోద్యమ చరిత్రను అందించే దిశగా గాంధీమందిరం, స్వాతంత్ర్య సమరయోథుల స్మ్రుతివనం ఎంతో చక్కగా రూపుదిద్దుకుందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం వంద అడుగుల ఎత్తులో వ్రతిష్టించనున్న జాతీయ జెండా పనులను ఆయన పరిశీలించారు. తొలుత జాతిపిత మవోత్మాగాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో గరిమెళ్ల సత్యనారాయణ విగ్రహ దాతలు, కొంక్యాన చారిటబుల్ ట్రస్టు చైర్మన్ మురళీధర్, వేణుగోపాల్‌తో పాటు గాంధీ మందిర కమిటీ నిర్వాహకులు నటుకుల మోహన్, నిక్కు అప్పన్న మహిబుల్త్లాఖాన్, మెట్ట అనంతభట్లు, వందిరి అప్పారావు, గుత్తు చిన్నారావు, ఆచంట రాము, పొన్నాడ రవికుమార్, తర్జాడ అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ నాయకులు సాధు వైకుంఠం, మెకానిక్ మోహన్, కరమ్‌చంద్ తదితరులు పాల్గొన్నారు.