వరద పరిస్థితికి అనుగుణంగా ఏర్పాట్లు


Ens Balu
2
Bhimavaram
2022-07-14 09:59:33

పశ్చిమగోదావరి జిల్లాలో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ధవళేశ్వరంలో ప్రస్తుతం రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని,  మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లయితే ఆచంట మండలంలోని 9 గ్రామాలు,  నర్సాపురం మండలంలోని 3  గ్రామాలు,  యలమంచిలి మండలంలోని 15 గ్రామాలకు వరద ప్రభావం  ఉండే అవకాశం ఉందని తెలిపారు.  7 ఎన్డిఆర్ఎఫ్ టీంలు, 5 ఎస్ డిఆర్ఎఫ్ టీమ్ లను సిద్ధంగా ఉంచడం జరిగిందిన్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తుగా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. ఆచంట మండలంలో  పెద్దమల్ల లంకలో చర్చి, అనగారి లంక గ్రామానికి సంబంధించి ఎంపీయుపి  స్కూల్,  పల్లెపాలెం గ్రామానికి సంబంధించి ఎంపియుపి స్కూల్,  అయోధ్య లంకకు సంబంధించి హరిజన పేట చర్చ్, అయోధ్య లంక కొత్త కాలనీ చర్చి,  పుచ్చలంక గ్రామానికి  సంబంధించి పుచ్చలంక డ్వాక్రా భవనం,  రవిలంక గ్రామానికి సంబంధించి  కమ్యూనిటీ హాల్,  మర్రి మూల గ్రామానికి సంబంధించి ఎంపీ యు పీ స్కూల్,  చర్చి ,  నక్కిడి లంక గ్రామానికి సంబంధించి ఎంపీయూపీ స్కూల్,  కాపుల పాలెం గ్రామానికి సంబంధించి జడ్పిహెచ్ఎస్  భీమలాపురం గ్రామంలో  పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్  తెలిపారు.

    అలాగే నరసాపురం మండలానికి సంబంధించి కొత్త నవరసపురం ఎంపీపీ స్కూల్,  పాత నవరసపురం గ్రామానికి సంబంధించి ఎంపీపీ స్కూల్,  లక్ష్మనేశ్వరం గ్రామానికి సంబంధించి రాజులంక డ్వాక్రా భవనంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.  అలాగే ఎలమంచిలి మండలానికి సంబంధించి కనకాయలంక  ఆర్యవైశ్య కళ్యాణ మండపం తాటిపాక,  ఎంపీపీ స్కూల్ సాకలి పాలెం పి గన్నవరం మండలం, పెదలంకకు సంబంధించి జడ్పీహెచ్ఎస్ స్కూల్,  ఎంపీపీ స్కూల్ తాటిపాక రాజోలు మండలం, దొడ్డిపట్ల గ్రామానికి సంబంధించి జెడ్ పి హెచ్ స్కూల్, అబ్బిరాజుపాలెం గ్రామానికి సంబంధించి ఎంపీపీ స్కూల్,  బడవ గ్రామానికి సంబంధించి వైవి లంకలోని ఓల్డ్ ఏజ్ హోమ్,  ఏనుగుల వాని లంకకు సంబంధించి వైవి లంకలోని జడ్పిహెచ్ఎస్ స్కూల్ ,  ఎలమంచిలి లంకకు సంబంధించి ఎంపీయుపీ స్కూల్,  లక్ష్మీ పాలెం కు సంబంధించి ఎంపీ యుపీ స్కూల్, గంగడుపాలెం కు సంబంధించి ఎంపీపీ స్కూల్,  కట్టుపాలెం సంబంధించి ఎంపీయుపీ స్కూల్, బూరుగుపల్లి గ్రామానికి సంబంధించి ఎంపీయుపీ స్కూల్ ,  కేఎస్ పాలెం కు సంబంధించి ఎంపీ యుపీ స్కూల్, నారిన మేరక గ్రామానికి సంబంధించి ఎంపీ యుపీ స్కూల్,  వడ్డీ లంక గ్రామానికి సంబంధించి ఎంపీ యుపీ స్కూల్,  సిరగాలపల్లి గ్రామానికి సంబంధించి జడ్పిహెచ్ఎస్ స్కూల్ లోను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి వివరించారు.