పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు
Ens Balu
5
Achanta
2022-07-15 12:29:36
పశ్చిమగోదావరి జిల్లాలోని భారీ వరదత నేపథ్యంలో పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని, ప్రజలు స్వచ్చందంగా తరలి రావాలని జెసి. జె వి మురళి కోరారు. లంక గ్రామాలు,లోతట్టు గ్రామాలు ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి రావాలని అన్ని వసతులు సమకూర్చడం జరిగిందని జిల్లా జాయింటు కలెక్టరు జె వి మురళి తెలిపారు. ఆచంట మండలం పలు గ్రామాలు ,పునరావాస కేంద్రాలను శుక్రవారం జిల్లా జాయింటు కలెక్టరు అధికారులతో కలసి పరిశీలించారు. యన్ డి ఆర్ యఫ్,యస్ డి ఆర్ యఫ్ , ఫైర్ సిబ్బంది సామాగ్రితో ఆచంట మండలంలోనే 35 మంది తమ సేవలు అందిస్తున్నారని ఆయన తెలిపారు.ప్రజలు అధికారులు సూచనలు , సలహాలు పాటించి సహకరించాలని ప్రజలకు జాయింటు కలెక్టరు ధైర్యం చెప్పారు. ప్రజల ఇబ్బంది పడకుండా ముందుగానే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.ఆచంట మండలంలో 15 గ్రామాలలో, ఆచంట మండలంలో పెద్దమల్లం లంక గ్రామానికి సంబంధించి పెద్దమల్లం చర్చి వద్ద రిలీఫ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని, అనగారిలంక గ్రామానికి సంబంధించి ఎం పీ యు పి స్కూల్ అనగారినిలంక, పల్లిపాలెం గ్రామానికి సంబంధించి ఎంపియుపి స్కూల్ పల్లిపాలెం , అయోధ్య లంకకు సంబంధించి అయోధ్య లంక హరిజన పేట చర్చ్ అయోధ్య లంక కొత్త కాలనీ చర్చి లో పుచ్చలంక గ్రామానికి సంబంధించి పుచ్చలంక డ్వాక్రా భవనంలోనూ, రావి లంక గ్రామానికి సంబంధించి రావిలంక కమ్యూనిటీ హాల్ లోను, మర్రి మూల గ్రామానికి సంబంధించి మర్రిమూల ఎంపీ యు పీ స్కూల్ , చర్చిలోను , బద్దెవారిపేట లోని యం పి యు పి స్కూల్ లోను , నక్కిడిలంక గ్రామానికి సంబంధించి ఎంపీయూపీ స్కూల్ నక్కిడిలంకలోను, కాపుల పాలెం గ్రామానికి సంబంధించి జడ్పిహెచ్ఎస్ భీమలాపురం గ్రామంలోని రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని జాయింటు కలెక్టరు తెలిపారు. రిలీఫ్ కెంపులో ఉన్నకుటుంబానికి వెళ్ళేటప్పుడు రూ.2,000 ఇవ్వడం జరుగుతుందని జిల్లా జాయింటు కలెక్టరు కలెక్టరు జె వి మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి వో దాసి రాజు, తహశీల్దారు నజీ మున్నిసాకు,యం పి డి ఓ కె కన్నం నాయుడు, వివిధ శాఖలు అధికారులు ,తది తరులు పాల్గొన్నారు.