రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకుని జగనన్న వాహాన మిత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ముఖ్యమంత్రి కి... ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, ఐటి మరియు పారిశ్రామిక శాఖ మాత్యులు గుడివాడ అమర్ నాథ్ , టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ, నెడ్ క్యాప్ ఛైర్మన్ కె కె రాజు, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్, జిల్లా కలెక్టర్ డా. ఎ మల్లికార్జున, నగర పోలీస్ కమిషనర్ సి. హెచ్. శ్రీకాంత్, ఆర్డిఓ హుస్సేన్ సాహెబ్ తదితరులు ముఖ్యమంత్రికి ఆత్మీయ వీడ్కోలు పలికారు. అనంతరం 12.40 గంటలకు ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి వెంట జిల్లా ఇన్ చార్జ్ మంత్రి , రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విడదల రజనీ, సిఎంఒ కార్యదర్శి రేవు ముత్యాల రాజు తదితరులు బయలుదేరి వెళ్లారు.